Breaking News

నిమ్స్‌లో మూలకణ పరిశోధన కేంద్రం


Published on: 19 Jan 2026 14:58  IST

నిమ్స్‌లో మూలకణ చికిత్స (స్టెమ్‌ సెల్‌ థెరపీ) అందించే దిశగా అడుగుపడింది. ఈ ఆస్పత్రిలో స్టెమ్‌ సెల్‌ పరిశోధన కేంద్రం ప్రారంభంకానుంది. హైదరాబాద్‌కు చెందిన బయోటెక్‌ స్టార్టప్‌ సంస్థ తులసి థెరప్యూటిక్స్‌ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని సోమవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ప్రారంభించనున్నారు. ఇక్కడ పరిశోధనలు విజయవంతమైతే ఎథిక్‌ కమిటీ అనుమతి లభించిన తర్వాత రోగులకు పూర్తిస్థాయిలో మూలకణ చికిత్స అందించనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి