Breaking News

శ్రీపంచమి వేళ విద్యార్థులకు గుడ్ న్యూస్..


Published on: 19 Jan 2026 19:04  IST

పర్వదినాల మాసం.. మాఘమాసం. జనవరి 23న మాఘ శుద్ధ పంచమి. ఈ శ్రీ పంచమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజు భక్తులకు శ్రీ దుర్గమ్మవారు సరస్వతీ దేవి రూపంలో దర్శనం ఇవ్వనున్నారు. దీంతో ప్రధాన ఆలయంలో అమ్మవారి మూల స్వరూపానికి ప్రత్యేక అలంకరణతో పాటు, మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవమూర్తిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి