Breaking News

విశాఖ జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌గా జనసేన కార్పొరేటర్‌..


Published on: 20 May 2025 14:10  IST

జీవీఎంసీ ప్రత్యేక సమావేశం ఇవాళ(మంగళవారం) జరిగింది. ఈ సమావేశంలో జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌గా జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గోవిందరెడ్డి నాయకత్వాన్ని ఎమ్మెల్యే గణబాబు ప్రతిపాదించగా.. మరో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బలపరిచారు. జాయింట్ కలెక్టర్ ఈ ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. అయితే జీవీఎంసీ మేయర్ పదవి ఇప్పటికే తెలుగుదేశం చేపట్టింది. దీంతో డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు కేటాయించారు.

Follow us on , &

ఇవీ చదవండి