Breaking News

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రియాన్ పరాగ్


Published on: 13 Feb 2026 18:11  IST

ఐపీఎల్ 2026 సమరం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా పలు ఫ్రాంచైజీల్లో పలు కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ కెప్టెన్‌ను ప్రకటించింది. యువ ప్లేయర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్‌లో ఆర్ఆర్‌కు నాయకత్వం వహించనున్నాడు. ఈ మేరకు జట్టు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.అయితే ఐపీఎల్ 2026 వేలంలో ఇప్పటి వరకు రాజస్థాన్‌కు కెప్టెన్‌గా ఉన్న సంజు శాంసన్.. చెన్నై సూపర్ కింగ్స్‌కు ట్రేడ్ ద్వారా వెళ్లిన విషయం తెలిసిందే.

Follow us on , &

ఇవీ చదవండి