Breaking News

బనకచర్ల ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తున్నాం:మంత్రి ఉత్తమ్


Published on: 03 Jun 2025 18:07  IST

గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తున్నామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అందులోభాగంగా ఈ ప్రాజెక్ట్‌ను అడ్డుకునేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ అంశాన్ని ఇప్పటికే కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌ దృష్టికి తీసుకు వెళ్లి.. మాట్లాడామన్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్మించకుండా అడ్డుకోవాలని ఆయన్ని కోరామని చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి