Breaking News

రాష్ట్రంలో భారీ వర్షాలు..


Published on: 12 Jun 2025 18:04  IST

శ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. అలాగే ఉత్తర కోస్తా, దక్షిణ ఓడిశాలో ప్రసుత్తం ఉపరితల ఆవర్తనం విస్తరించిందని తెలిపింది. ఈ ప్రభావం కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.అలాగే కోస్తా ఆంధ్రాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని చెప్పింది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందంది.

Follow us on , &

ఇవీ చదవండి