Breaking News

సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు ఏడాదికి రెండుసార్లు..?


Published on: 25 Jun 2025 17:27  IST

సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 2026 నుంచి సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలు ఏడాదిలో రెండుసార్లు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మొదటి విడత పరీక్షలు ఫిబ్రవరిలో ఉంటాయి. ఈ పరీక్షలకు విద్యార్థులంతా తప్పనిసరిగా హాజకావాల్సి ఉంటుంది. ఇక రెండో విడత పరీక్షలు మేలో ఉంటాయి. ఇది ఐచ్ఛికం. తమ పెర్‌ఫారమెన్స్ పెంచుకోవాలని ఆశించే విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఇంటర్నల్ అసెస్‌మెంట్ మాత్రం అకడమిక్ సెషన్‌లో ఒకేసారి ఉంటుంది.

Follow us on , &

ఇవీ చదవండి