Breaking News

భారత్‌-పాక్‌ వివాదం.. ట్రంప్‌ నోట మళ్లీ అదే మాట


Published on: 28 Jun 2025 12:43  IST

భారత్‌-పాక్‌ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య యుద్ధాని ఆపింది తానేనని మరోసారి వ్యాఖ్యానించారు. అణు సంఘర్షణను తాను ఒంటరిగానే అణచివేశానని పేర్కొన్నారు. వైట్‌హౌస్‌ వద్ద విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీ-ఇస్లామాబాద్‌లు యుద్ధాన్ని ఆపకపోతే వాణిజ్య ఒప్పందాలను పూర్తిగా నిలిపివేస్తామని హెచ్చరించాలని సీనియర్‌ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి