Breaking News

ఓఆర్‌ఆర్‌పై ప్రమాదం.. వరుసగా ఢీకొన్న 10 కార్లు


Published on: 30 Jun 2025 12:37  IST

శంషాబాద్‌ పరిధిలో ఓఆర్‌ఆర్‌ (ORR)పై రోడ్డు ప్రమాదం జరిగింది. 10 కార్లు వరుసగా ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఆదివారం అర్ధరాత్రి చెన్నమ్మ హోటల్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కార్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అందులోని ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఓ కారు డ్రైవర్‌ మితిమీరిన వేగంతో వెళ్లి ఒక్కసారిగా బ్రేక్‌ వేశాడు. దీంతో దాని వెనుక వస్తున్న 10 కార్లు వరుసగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంతో 2 కి.మీ మేర ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

Follow us on , &

ఇవీ చదవండి