Breaking News

ఆ వంతెనలు త్వరలో అందుబాటులోకి


Published on: 29 Apr 2025 10:53  IST

గ్రేటర్‌ పరిధిలో జాతీయ రహదారులపై నిర్మించిన రెండు వంతెనల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. హైదరాబాద్‌-ముంబై జాతీయ రహదారి(65)పై బీహెచ్‌ఈఎల్‌ వద్ద జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) వంతెన నిర్మించింది. జనవరి 2023లో ప్రారంభమైన నిర్మాణ పనులు పూర్తి కావడంతో మే 5వ తేదీన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారిపై అంబర్‌పేట వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్‌తో పాటు  శంషాబాద్‌, తొండుపల్లిల్లో వంతెనలూ అదేరోజు ప్రారంభించనున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి