Breaking News

ప్రధాని పీఠం మళ్లీ మార్క్‌ కార్నీకే


Published on: 29 Apr 2025 15:40  IST

కెనడా సార్వత్రిక ఎన్నికల్లో (Canada Elections) అధికార లిబరల్‌ పార్టీ విజయం సాధించింది. వరుసగా నాలుగోసారి అధికారాన్ని సొంతం చేసుకుంది. దాంతో కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ (Mark Carney) నే మరోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించబోతున్నారు. ఈ ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీకి 167 స్థానాలు దక్కాయి. ప్రతిపక్ష కన్జర్వేటివ్‌ పార్టీ కేవలం 145 స్థానాలకే పరిమితమైంది. దాంతో లిబరల్ పార్టీకి అధికారం ఖాయమైంది. కన్జర్వేటివ్‌ పార్టీ నేత పియరీ పొయిలివ్రా ఓటమిని అంగీకరించారు.

Follow us on , &

ఇవీ చదవండి