Breaking News

పహల్గాం దాడి వెనక ఫరూఖ్‌ నెట్‌వర్క్‌.


Published on: 30 Apr 2025 15:36  IST

పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేయడానికి కశ్మీర్‌ నుంచి పారిపోయి పాక్‌లో స్థిరపడిన ఓ ఉగ్రవాది నెట్‌వర్క్‌ సాయపడినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది. లష్కరే తోయిబాకు చెందిన కమాండర్‌ ఫరూఖ్‌ అహ్మద్‌ తేడ్వా కూడా ఈ దాడిలో కీలకపాత్ర పోషించినట్లు భావిస్తున్నారు. ఇటీవలే భద్రతా దళాలు కుప్వారాలో అతడి ఇంటిని పేల్చివేశాయి. ఫరూఖ్‌కు కశ్మీర్‌లోని పర్వతాలు, లోయల్లో మార్గాలపై పట్టు ఉంది. అతడే మూడు మార్గాల ద్వారా ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు సాయం చేశాడు.

Follow us on , &

ఇవీ చదవండి