Breaking News

కులగణనపై కేంద్రం కీలక నిర్ణయం


Published on: 30 Apr 2025 18:14  IST

దేశంలో కులగణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే జనాభా లెక్కల్లోనే కులగణన చేర్చుతామని కేంద్రం ప్రకటించింది. కులగణన పేరుతో కాంగ్రెస్‌ సర్వే చేయించిందని, ఆయా రాష్ట్రాల్లో చేపడుతున్న సర్వేల్లో పారదర్శకత లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. నేడు కేంద్ర కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన వివరాలను మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాకు వెల్లడించారు.తదుపరి దేశవ్యాప్తంగా చేపట్టే జనాభా లెక్కల ప్రక్రియలో కులగణనను చేర్చి పారదర్శకంగా చేపట్టాలన్నదే మోదీ ప్రభుత్వ సంకల్పమని చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి