Breaking News

భద్రాచలం సమీపంలో వాయుగుండం..


Published on: 29 Oct 2025 17:14  IST

తుపాను గత రాత్రి కాకినాడకు దక్షిణంగా నరసాపూర్‌కు సమీపంలో తీరం దాటిందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర వాయువ్యదిశగా పయనిస్తూ క్రమంగా బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను ఆనుకొని భద్రాచలం సమీపంలో కొనసాగుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. బుధవారం భారీ వర్షాలు పడుతాయని ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం,  జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి