Breaking News

రాయదుర్గంలో కాల్పుల కలకలం


Published on: 04 Nov 2025 18:32  IST

హైదరాబాద్‌ మణికొండలోని పంచవటి కాలనీలో భూ వివాదానికి సంబంధించి ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఏపీ మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు ప్రభాకర్‌ గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం.స్థలం ఖాళీ చేయాలని బాధితుడిని ప్రభాకర్‌ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కాల్పులపై బాధిత వర్గం రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి