Breaking News

మద్యం స్కాం నిందితులకు హైకోర్టు ఆదేశం


Published on: 19 Nov 2025 16:26  IST

ఏపీలోని మద్యం కుంభకోణం కేసులో రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డితోపాటు బాలాజీ గోవిందప్పలకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని సీఐడీ వేసిన పిటిషన్‌ను బుధవారం ఏపీ హైకోర్టు విచారించింది. అందుకు పాక్షికంగా హైకోర్టు అనుమతించింది. నవంబర్ 26వ తేదీలోగా ఏసీబీ కోర్టు ముందు సరెండర్ కావాలని వారికి స్పష్టం చేసింది. రెగ్యులర్ బెయిల్ దాఖలు చేసుకొనేందుకు వారికి అనుమతి ఇచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి