Breaking News

తేల్చిచెప్పిన దాస్యం విన‌య్ భాస్క‌ర్


Published on: 20 Nov 2025 17:58  IST

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడుతున్న మా పార్టీ కార్యానిర్వ‌హ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి కుట్ర‌లు చేస్తున్నాడ‌ని దాస్యం విన‌య్ భాస్క‌ర్ మండిప‌డ్డారు. కాంగ్రెస్‌ది ప్ర‌జా పాల‌న కాదు ప్ర‌తీకార పాల‌న అని నిప్పులు చెరిగారు. ఫార్ములా ఈ కేసు కాంగ్రెస్ ప్ర‌భుత్వ కుంచిత‌త్వానికి నిద‌ర్శం. కాంగ్రెస్ పూట‌కో కేసు పేరు చెప్పి మా నాయ‌కుల‌ను బ‌ద్నాం చేసే ప్ర‌యత్నం చేస్తోంది. కాంగ్రెస్ ఎన్ని కుట్ర‌లు చేసినా ప్ర‌జా పోరాటం ఆపం. ప్ర‌జ‌ల త‌ర‌పున ప్ర‌శ్నించ‌డం ఆపం అని విన‌య్ భాస్క‌ర్ తేల్చిచెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి