Breaking News

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత


Published on: 30 Dec 2025 11:14  IST

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధినేత్రి ఖలీదా జియా తుదిశ్వాస విడిచారు. ఆ దేశ రాజకీయాల్లో దశాబ్దాల పాటు చక్రం తిప్పిన ఆమె.. 80 ఏళ్ల వయసులో గుండె,ఊపిరిత్తుల్లో ఇన్ఫెక్షన్‌కు గురై గత నవంబర్ 23న ఢాకా లోని ఎవర్‌కేర్ ఆస్పత్రిలో చేరారు. అనంతరం.ఆమెకు న్యుమోనియా సోకినట్టు వైద్యులు గుర్తించారు. దీంతో ఆమె ఆరోగ్యం రోజు రోజుకూ మరింత వేగంగా క్షీణించింది. ఈ నేపథ్యంలో ఆమె వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ.. మంగళవారం ఉదయం 6:00 గంటలకు తనువు చాలించారు

Follow us on , &

ఇవీ చదవండి