Breaking News

గ్రూప్‌-2 అభ్యర్థులకు బిగ్ రిలీఫ్


Published on: 30 Dec 2025 15:39  IST

ఆంధ్రప్రదేశ్ గ్రూప్‌-2 రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. కాగా, 2023లో విడుదలైన గ్రూప్-2 నోటిఫికేషన్‌‌పై రిజర్వేషన్ల విధానాన్ని సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్ రోస్టర్‌ను పాటించాలని కోరుతూ అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేశారు.2023లో విడుదలైన గ్రూప్-2 నోటిఫికేషన్‌ను రద్దు చేసి, పాత నోటిఫికేషన్‌కు బదులు కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని అభ్యర్థులు కోరారు.

Follow us on , &

ఇవీ చదవండి