Breaking News

పాక్‌ వద్ద అడుగంటిన ఫిరంగి గుండ్లు


Published on: 05 May 2025 11:42  IST

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ దాడికి దిగితే తగిన రీతిలో జవాబిస్తామంటూ ఒక పక్క పాకిస్థాన్‌ మంత్రులు, ఆర్మీ ఉన్నతాధికారులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుండగా, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఆ దేశం కీలకమైన ఫిరంగి మందుగుండు సామగ్రి కొరతతో ఇబ్బంది పడుతున్నది. యుద్ధమంటూ మొదలైతే నాలుగు రోజుల్లో శతఘ్ని గుండ్లు ఖాళీ అవుతాయని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ న్యూస్‌ ఏజెన్సీ ఏఎన్‌ఐ పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి