Breaking News

కొత్తకోటలో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై ఏప్రిల్ 29, 2026 న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. 

Published on: 29 Apr 2026 15:26  IST

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై ఏప్రిల్ 29, 2026 న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. 

చిన్నంబావి మండలం మియాపూర్‌లో జరుగుతున్న బంధువుల వివాహానికి ఒకే కుటుంబానికి చెందిన వారు కారులో బయలుదేరారు. పాలెం సమీపంలో కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న డీసీఎం వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మాళవిక (20) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది.

లలిత, తన్విక, మహేష్, మరియు మల్లేష్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి 108 వాహనంలో వీరిని వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు.గాయపడిన వారిలో లలిత పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన చికిత్స కోసం ఆమెను కర్నూలు ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి