Breaking News

మల్లాపూర్‌లో వైద్యుడు బలవన్మరణం

హైదరాబాద్ మల్లాపూర్‌లోని రికవరీ హాస్పిటల్‌లో డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (DMO)గా పనిచేస్తున్న డాక్టర్ ఖాసిం హైమద్ జూన్ 22, 2026 (సోమవారం) రాత్రి విషపూరిత/మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.


Published on: 23 Jun 2026 18:04  IST

హైదరాబాద్ మల్లాపూర్‌లోని రికవరీ హాస్పిటల్లో డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (DMO)గా పనిచేస్తున్న డాక్టర్ ఖాసిం హైమద్ జూన్ 22, 2026 (సోమవారం) రాత్రి విషపూరిత/మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు జూన్ 23, 2026న వెలుగులోకి వచ్చాయి.

డాక్టర్ ఖాసిం ఆసుపత్రిలోని రెండవ అంతస్తులో ఉన్న రూమ్ నంబర్ 201లోకి వెళ్లి లోపలి నుంచి తాళం వేసుకున్నారు. అనంతరం తనకు తానే విషపూరిత/మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.ఈయన స్వస్థలం విశాఖపట్నం కాగా, ప్రస్తుతం హైదరాబాద్‌లోని యాకుత్‌పురా ప్రాంతంలో నివాసముంటున్నారు.

ఆసుపత్రి యాజమాన్యం నుంచి ఎదురవుతున్న విపరీతమైన పని ఒత్తిడి, మానసిక వేధింపుల వల్లే ఆయన ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. అలాగే ఈ ఘటనను బయటకు రాకుండా దాచడానికి ఆసుపత్రి వారు ప్రయత్నించారని కూడా వారు వాపోయారు.

Follow us on , &

ఇవీ చదవండి