Breaking News

ఐఎస్ సదన్లో ఏటీఎంలో డబ్బులు చోరీ

హైదరాబాద్‌లోని సంతోష్ నగర్ పరిధిలోని ఐఎస్ సదన్ ప్రాంతంలో రూ. 17 లక్షల ఏటీఎం నగదు చోరీకి గురైంది. ఏటీఎంలో డబ్బులు నింపడానికి వచ్చిన క్యాష్ మేనేజ్‌మెంట్ వ్యాన్ డ్రైవర్, మరో వ్యక్తితో కలిసి ఈ భారీ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

Published on: 23 Jun 2026 18:43  IST

హైదరాబాద్‌లోని సంతోష్ నగర్ పరిధిలోని ఐఎస్ సదన్ ప్రాంతంలో రూ. 17 లక్షల ఏటీఎం నగదు చోరీకి గురైంది. ఏటీఎంలో డబ్బులు నింపడానికి వచ్చిన క్యాష్ మేనేజ్‌మెంట్ వ్యాన్ డ్రైవర్, మరో వ్యక్తితో కలిసి ఈ భారీ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని ఏటీఎంలలో నగదు నింపేందుకు ఒక ప్రైవేట్ క్యాష్ మేనేజ్‌మెంట్ సంస్థకు చెందిన వ్యాన్ అక్కడకు చేరుకుంది.వ్యాన్ లోని సిబ్బంది ఏటీఎం సెంటర్ లోపలికి వెళ్లిన సమయంలో ఈ ఘోరం జరిగింది. ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి, వ్యాన్‌లో ఉన్న రూ. 17 లక్షల నగదు గల ట్రంకు పెట్టెను తీసుకొని క్షణాల్లో పరారయ్యారు.ఈ ఘటన జరిగిన వెంటనే సదరు క్యాష్ వ్యాన్ డ్రైవర్ కూడా అక్కడి నుంచి మాయమయ్యాడు. దీంతో డ్రైవరే ముందస్తు స్కెచ్‌తో మరొకరితో కలిసి ఈ దారిదోపిడీకి పాల్పడి ఉంటాడని పోలీసులు గట్టిగా భావిస్తున్నారు.ఈ దోపిడీ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఐఎస్ సదన్ పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

Follow us on , &

ఇవీ చదవండి