Breaking News

చంద్రగ్రహణం కారణంగా యాదాద్రి మూసివేత

మార్చి 3, 2026 (మంగళవారం) నాడు సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంమూసివేయబడింది. మార్చి 3 ఉదయం 7:00 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేశారు.


Published on: 03 Mar 2026 16:09  IST

మార్చి 3, 2026 (మంగళవారం) నాడు సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం మూసివేయబడింది. మార్చి 3 ఉదయం 7:00 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేశారు.మార్చి 4, 2026 (బుధవారం) తెల్లవారుజామున ఉదయం 3:00 గంటలకు ఆలయాన్ని తెరుస్తారు.

మార్చి 4న ఆలయ శుద్ధి మరియు సంప్రోక్షణ అనంతరం ఉదయం 8:45 గంటల నుండి భక్తులకు స్వామివారి ఉభయ దర్శనాలు ప్రారంభమవుతాయి.మార్చి 3న జరగాల్సిన అన్ని ఆర్జిత సేవలు, కళ్యాణోత్సవాలు మరియు అన్నప్రసాద వితరణ రద్దు చేయబడ్డాయి. 

గ్రహణం కారణంగా ప్రధానాలయంతో పాటు ఉపాలయాలు (పాతగుట్ట) మరియు అనుబంధ ఆలయాలు కూడా మూసివేయబడ్డాయి. భక్తులు ఈ మార్పును గమనించి తమ యాత్రను ప్లాన్ చేసుకోవాల్సిందిగా యాదగిరిగుట్ట దేవస్థానం అధికారులు సూచించారు.

Follow us on , &

ఇవీ చదవండి