Breaking News

మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతి


Published on: 21 May 2025 16:20  IST

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు మృతి చెందారు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఎక్స్‌లో వెల్లడించారు. బుధవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారిలో నంబాల కేశవరావు ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. కేశవరావుపై రూ.1.5కోట్లు రివార్డు ఉందని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి