Breaking News

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గుండ రాకేశ్ (22) అనే యువకుడు తన పుట్టినరోజు నాడే దుర్మరణం పాలయ్యాడు.మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన గుండ రాకేశ్ (22) హైదరాబాద్‌లో హోటల్ మేనేజ్‌మెంట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.


Published on: 17 Jun 2026 16:06  IST

హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గుండ రాకేశ్ (22) అనే యువకుడు తన పుట్టినరోజు నాడే దుర్మరణం పాలయ్యాడు.మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన గుండ రాకేశ్ (22) హైదరాబాద్‌లో హోటల్ మేనేజ్‌మెంట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. జూన్ 15 రాత్రి రాకేశ్ తన 22వ పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్‌లో స్నేహితులతో కలిసి జరుపుకున్నాడు. అనంతరం మరో మిత్ర బృందం పిలవడంతో, తన స్నేహితుడితో కలిసి ద్విచక్రవాహనం (బైక్) పై బయలుదేరాడు.ప్రయాణంలో బైక్ అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాకేశ్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనుక కూర్చున్న అతని స్నేహితుడికి స్వల్ప గాయాలయ్యాయి

కుటుంబంలో విషాదం

చివరి ఫోన్ కాల్: ప్రమాదానికి కాసేపటి ముందే రాకేశ్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడాడు. "చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగం సాధించి నాన్న కష్టాలు తీరుస్తాను.. తమ్ముడు, చెల్లి బాధ్యత నేను తీసుకుంటాను" అని ఎంతో ఆనందంగా మాట్లాడిన కొడుకు అంతలోనే శవమై కనిపించడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

తండ్రి ఆవేదన: కొడుకును చదివించడం కోసం రాకేశ్ తండ్రి మల్లేశ్ ముంబయిలో కూలీ పనులు చేస్తున్నారు. పుట్టినరోజు నాడే కొడుకు మరణవార్త వినడంతో ఆయన అత్యవసరంగా హైదరాబాద్ చేరుకున్నారు.పోస్టుమార్టం అనంతరం రాకేశ్ భౌతికకాయాన్ని అతని స్వగ్రామమైన చింతగూడకు తరలించారు. పుట్టినరోజే ఆఖరి రోజు కావడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement