Breaking News

కరోనా కలకలం.. ఏపీలో మరో కేసు


Published on: 23 May 2025 15:02  IST

ఏపీ‌లో కరోనా కేసులు నమోదు కలకలం రేపుతోంది. కడపలో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన 75 ఏళ్ల వృద్ధురాలికి తీవ్ర జ్వరం ఉండటంతో అనుమానించిన వైద్యులు గత రాత్రి కరోనా పరీక్షలు చేశారు. ఈ నేపథ్యంలో ఆమెకు కరోనా సోకినట్లు రిమ్స్ వైద్యులు తేల్చారు. ఇక కడప జిల్లాలో మరోసారి మొదటిగా ఒక కరోనా కేసు వెలుగులోకి రావడంతో జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి