Breaking News

కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ..


Published on: 23 May 2025 16:30  IST

హస్తినలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. కేంద్ర మంత్రులతో చంద్రబాబు వరుసగా భేటీలు అవుతున్నారు. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, భూ విజ్ఞాన శాఖల మంత్రి జితేంద్ర సింగ్‌తో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అంతరిక్ష తయారీ, ఆవిష్కరణలకు కీలక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వ మద్దతు కోరుతూ ఒక సమగ్ర ప్రతిపాదనను సీఎం సమర్పించారు.

Follow us on , &

ఇవీ చదవండి