Breaking News

బార్ లో ఫ్రెండ్స్ మధ్య గొడవ: యువకుడు హత్య


Published on: 26 May 2025 12:18  IST

ఉప్పల్​ లో తాగుబోతులు వీరంగం సృష్టించారు. మద్యం మోతాదుకు మించి తాగారో ఏమో తెలియదు కాని ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటుండగా మరో వ్యక్తి (పవన్​ కుమార్​) నచ్చచెప్పేందుకు వెళ్లాడు. ఇక అంతే అందులో ఒకరు మధ్యవర్తిగా వచ్చిన పవన్​ కుమార్​ ను బీరు సీసాతో పొడవడంతో అక్కడికక్కడే మరణించాడు.. ఈ ఘటన రామంతాపూర్​ గుడ్​ డే బార్​ లో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Follow us on , &

ఇవీ చదవండి