Breaking News

మనోళ్ల పైసలపైనా పన్ను!


Published on: 05 Jun 2025 18:53  IST

ఇప్పటికే ప్రపంచ దేశాలను ప్రతీకార సుంకాలతో షేక్‌ చేసిన డొనాల్డ్‌ ట్రంప్‌.. వలసదారుల కష్టార్జితాన్నీ వదిలిపెట్టడం లేదు. ఈ క్రమంలోనే రెమిటెన్స్‌లపై 3.5 శాతం ఎక్సైజ్‌ ట్యాక్స్‌ను ప్రతిపాదించారు. ఇది చట్టం రూపం దాల్చితే ఎన్నారై లు భారత్‌లోని తమ కుటుంబ సభ్యులకు పంపించే నగదుపై పన్ను భారం పడనున్నది. ఇక్కడకు వచ్చే ప్రతీ లక్ష రూపాయలపై రూ.3,500 ట్యాక్స్‌ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.10 లక్షలకు రూ.35 వేలు, కోటి రూపాయలకు రూ.3.5 లక్షలు నష్టపోవాల్సి వస్తుందన్నమాట.

Follow us on , &

ఇవీ చదవండి