Breaking News

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్


Published on: 10 Jun 2025 17:04  IST

తెలంగాణ జాగృతి నేత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టయ్యారు. పెంచిన బస్ పాస్ ధరలను వెంటనే తగ్గించాలంటూ తెలంగాణ జాగృతి కార్యకర్తలతో కలిసి ఇవాళ(మంగళవారం) బస్ భవన్‌ను ముట్టడించేందుకు కవిత ప్రయత్నించారు. ఆ క్రమంలో ఆమె ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ మేరకు కవిత, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి