Breaking News

కోల్‌కతా అత్యాచార ఘటన..సెక్యూరిటీ గార్డు అరెస్టు


Published on: 28 Jun 2025 14:29  IST

దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న దక్షిణ కోల్‌కతా లా కాలేజీ సామూహిక అత్యాచార ఘటనలో పోలీసులు తాజాగా సెక్యూరిటీ గార్డును అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇది నాలుగో అరెస్టు. అంతకుమునుపు, ప్రధాన నిందితుడితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.పోలీసు వర్గాల కథనం ప్రకారం, విద్యార్థినిపై లైంగిక దాడి జరిగిన సమయంలో సెక్యూరిటీ గార్డు ఆ పరిసరాల్లోనే ఉన్నాడు. నిందితుడి సూచనల మేరకు అతడు గార్డు రూమ్‌లో బాధితురాలిని ఒంటరిగా వదిలి వెళ్లిపోయాడు.

Follow us on , &

ఇవీ చదవండి