Breaking News

‘ఓవర్‌ టైమ్‌ వద్దు’.. ఉద్యోగులకు ఇన్ఫీ మెయిల్స్‌..


Published on: 01 Jul 2025 14:02  IST

ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌ (Infosys) తమ ఉద్యోగుల వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌పై కీలక సూచనలు చేసింది. పని గంటలకు మించి పని చేయొద్దని సూచించింది. అదనపు గంటలు పనిచేస్తున్న వారికి వ్యక్తిగతంగా ఇ-మెయిల్స్‌ పంపిస్తోంది. వర్క్‌లైఫ్‌ బ్యాలెన్స్‌ ఉండాలని, పని సమయంలో ఎప్పటికప్పుడు బ్రేక్‌ తీసుకోవాలని అందులో ప్రస్తావిస్తున్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని సూచిస్తోంది. ఈనేపథ్యంలో పలువురు ఇన్ఫీ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి వ్యాఖ్యలను ప్రస్తావిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి