Breaking News

ముల్కనూరులో ఘనంగా డాక్టర్స్ డే


Published on: 01 Jul 2025 16:35  IST

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరులో మంగళవారం డాక్టర్స్ డే దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముల్కనూరు ప్రభుత్వ వైద్యాధికారి ప్రదీప్ రెడ్డి, ప్రైవేట్ వైద్యులు సుధాకర్, స్వామిరావు లను కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ మండల నాయకులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ మండల శాఖ అధ్యక్షుడు బొజ్జపురి మురళీకృష్ణ మాట్లాడుతూ వైద్యులు కనిపించే ప్రత్యక్ష దైవాలని చెప్పారు.  అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం కేటాయించిన 108 వాహనాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు

Follow us on , &

ఇవీ చదవండి