Breaking News

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల తర్వాతే స్థానిక ఎన్నికలు..!


Published on: 02 Jul 2025 18:23  IST

బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కేటాయించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఇటీవల మరణించిన వైరా మాజీఎమ్మెల్యే మదన్ లాల్ కుటుంబసభ్యులను పరామర్శించిన కవిత. ఖమ్మంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీలో ఆమోదించి బిల్లును ఢిల్లీకి పంపిన కాంగ్రెస్ చేతులు దులుపుకున్నట్లుగా కనిపిస్తుందని ఆరోపించారు.

Follow us on , &

ఇవీ చదవండి