Breaking News

48 గంటల్లో భారత్‌-అమెరికా మధ్య ట్రేడ్‌ డీల్‌..!


Published on: 03 Jul 2025 11:40  IST

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్‌-అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ ఉత్కంఠకు మరో 48 గంటల్లో తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. వాషింగ్టన్‌లో జరుగుతున్న ఉన్నతస్థాయి చర్చలు తుది దశకు చేరుకున్నట్లు తెలిసింది. మరో రెండు రోజుల్లో ఇరు దేశాల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదరనున్నట్లు తెలుస్తోంది. చర్చలు చివరి దశలో ఉన్నాయని స‌మాచారం.

Follow us on , &

ఇవీ చదవండి