Breaking News

ఏపీకి ఐదు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు..


Published on: 17 Jul 2025 17:18  IST

కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే 2024-25లో  ఇండోర్ వరుసగా 8వ సారి అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలిచింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఐదు అవార్డులు గెల్చుకుని వావ్ అనిపించింది. స్వచ్ఛ సర్వేక్షన్-2025 అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రం నుంచి విజయవాడ, తిరుపతి, గుంటూరు, గ్రేటర్ విశాఖపట్నం (జీవీఎంసీ), రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లు అవార్డులు దక్కించుకున్నాయి.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ అవార్డు స్వీకరించారు.

Follow us on , &

ఇవీ చదవండి