Breaking News

ఇన్ఫోసిస్‌లో 195 మంది ట్రైనీల తొలగింపు


Published on: 29 Apr 2025 15:33  IST

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో ట్రైనీల తొలగింపుల పర్వం కొనసాగుతోంది. తుది ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లో విఫలమైన కారణంగా మరో 195 మందిని ఆ సంస్థ పక్కన పెట్టింది. ఈ ఏడాది ట్రైనీలను తొలగింపు చేపట్టడం వరుసగా ఇది నాలుగోసారి. పరీక్షలో ఫెయిల్‌ అయిన ట్రైనీలకు ఇ-మెయిల్‌ ద్వారా ఇన్ఫోసిస్‌ సమాచారం ఇచ్చినట్లు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.తొలగించిన ట్రైనీలకు ఇన్ఫోసిస్‌ ఉచితంగా శిక్షణ అందిస్తోంది. ఎన్‌ఐఐటీ, అప్‌గ్రాడ్‌ ద్వారా వివిధ కోర్సుల్లో శిక్షణ ఇప్పిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి