Breaking News

అభిమానికి క్షమాపణలు చెప్పిన ప్రీతి జింటా


Published on: 29 Apr 2025 16:28  IST

బాలీవుడ్‌ నటి ప్రీతి జింటా ఓ అభిమానికి క్షమాపణలు చెప్పారు. ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రీతి (Preity Zinta) ఎక్స్‌లో అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని ‘మీరు భాజపాలో చేరుతున్నారా?’ అని అడగ్గా. దానికి ప్రీతి కాస్త కఠినంగా సమాధానమిచ్చారు. దీంతో నెట్టింట ఆమె తీరుపై విమర్శలు ప్రారంభమయ్యాయి. తాజాగా ఆ ప్రశ్న అడిగిన అభిమానికి ప్రీతి క్షమాపణలు చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి