Breaking News

ఐపీఎల్‌లో 14 ఏండ్ల బాలుడి విధ్వంసక శతకం


Published on: 29 Apr 2025 18:12  IST

వైభవ్‌ సూర్యవంశీ (38 బంతుల్లో 101, 7 ఫోర్లు, 11 సిక్సర్లు) ఐపీఎల్‌-18లో పాత రికార్డుల దుమ్ముదులిపి సరికొత్త చరిత్ర సృష్టించాడు. 14 ఏండ్లకే ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఈ బీహార్‌ చిచ్చరపిడుగు.. జైపూర్‌లో సృష్టించిన పరుగుల సునామీకి 2025 సీజన్‌లో వరుస ఓటముల తర్వాత రాజస్థాన్‌ రాయల్స్‌ గెలుపు బాట పట్టింది. వైభవ్‌ విధ్వంసక శతకానికి తోడు యశస్వి జైస్వాల్‌ (40 బంతుల్లో 70 నాటౌట్‌, 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ అర్థశతకంతో రెచ్చిపోగా.. గుజరాత్‌ టైటాన్స్‌  210 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్‌ 15.5 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి దంచేసింది. 

Follow us on , &

ఇవీ చదవండి