Breaking News

మే 3వ తేదీ నుంచి మే 21వ తేదీ వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది.

రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలో ఉన్న డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం తెలంగాణ ప్రభుత్వం "దోస్త్" అనే ప్రక్రియ ద్వారా అడ్మిషన్ షెడ్యూల్‌ను విడుదల చేసింది


Published on: 02 May 2025 15:15  IST

హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలో ఉన్న డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం తెలంగాణ ప్రభుత్వం "దోస్త్" అనే ప్రక్రియ ద్వారా అడ్మిషన్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. మే 3వ తేదీ నుంచి మే 21వ తేదీ వరకు విద్యార్థులు రూ.200 చెల్లించి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. మే 10వ తేదీ నుంచి మే 22 వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకునేందుకు అవకాశం కల్పించారు. అనంతరం మే 29న మొదటి విడత సీట్ల కేటాయింపు జరగనుంది. ఈ విడతలో సీట్లు పొందిన విద్యార్థులు మే 30 నుంచి జూన్ 6వ తేదీ వరకు తాము ఎంపికైన కాలేజీలకు వెళ్లి సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

మరుసటి రోజు నుంచే రెండో విడత ప్రక్రియ ప్రారంభమవుతుంది. మే 30 నుంచి జూన్ 8 వరకు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు, అయితే ఈ దశలో దరఖాస్తు ఫీజు రూ.400గా నిర్ణయించారు. వెబ్ ఆప్షన్లు జూన్ 9వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. జూన్ 13న సీట్ల కేటాయింపు చేస్తారు, ఆ తర్వాత జూన్ 18 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్‌కు అవకాశం ఉంది.

జూన్ 13 నుంచి 19వ తేదీ వరకు మూడో విడత దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది. దీనికీ రూ.400 ఫీజు విధించారు. జూన్ 23న తుది విడత సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఆ సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 28వ తేదీ వరకు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. డిగ్రీ ఫస్ట్ ఇయర్ తరగతులు జూన్ 30 నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి