Breaking News

సర్కార్‌ బడి టీచరమ్మ వేషాలు చూశారా?


Published on: 04 Nov 2025 13:00  IST

శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఓ టీచర్మ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడానికి బదులు వీధి రౌడీలా కుర్చీలో కూర్చుని పిల్లలతో కాళ్లు పట్టించుకుంది. కుర్చీ వెనక్కి వాలి సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ విలాసవంతంగా సమయం గడపసాగింది. ఇద్దరు విద్యార్థినులతో చెరొక కాళ్లు నొక్కించుకుంటున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఉపాధ్యాయురాలికి షోకాజ్ నోటీసు జారీ చేశామని, విచారణకు ఆదేశించామన్నారు ఐటీడీఏ పీవో జగన్నాథ్.

Follow us on , &

ఇవీ చదవండి