Breaking News

ఉల్లి రైతుల సమస్యలని వెంటనే పరిష్కరించాలి


Published on: 04 Nov 2025 14:58  IST

ఉల్లి రైతుల  సమస్యలని ఏపీ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌ రెడ్డి డిమాండ్ చేశారు. 17 వేల ఎకరాల్లో ఉల్లి రైతులు నష్టపోయారని పేర్కొన్నారు. కడప కలెక్టర్ శ్రీధర్‌ని ఇవాళ (మంగళవారం) కలిశారు ఎంపీ అవినా‌ష్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కలెక్టర్‌ని కలిసి ఉల్లి రైతుల సమస్యలని వెంటనే పరిష్కరించాలని కోరానని చెప్పుకొచ్చారు.  అక్టోబరులో కూడా ఈ విషయంపై కలెక్టర్ శ్రీధర్‌ని కలిశానని గుర్తుచేశారు అవినాశ్‌ రెడ్డి.

Follow us on , &

ఇవీ చదవండి