Breaking News

రేవంత్ రెడ్డిపై మండిప‌డ్డ కేటీఆర్


Published on: 06 May 2025 16:37  IST

ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేర‌కు పీఆర్సీ, డీఏలు అడిగితే.. రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను ప్ర‌జ‌ల‌ను ముందు విలన్లుగా చిత్రీక‌రిస్తారా..? అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు రేవంత్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ ఏ ఒక్క హామీ ఇప్ప‌టి వ‌ర‌కు నెర‌వేర‌లేదు. తెలంగాణ కోసం వారు చేసిన త్యాగం గురించి రేవంత్ రెడ్డికి ఇసుమంతైనా తెలియ‌దు. అని కేటీఆర్ తెలిపారు..

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement