Breaking News

లిఫ్టులో ఇరుక్కున్న జొమాటో డెలివరీ బాయ్‌


Published on: 12 Nov 2025 16:26  IST

సరూర్‌నగర్‌ నివాసి చెరుకు మల్లె రాంబాబు జొమాటో డెలివరీబాయ్‌గా పనిచేస్తున్నాడు. మలక్‌పేట ప్రొఫెసర్‌ కాలనీ లోని ఓ రెసిడెన్సీలోని ఫ్లాట్‌లో ఫుడ్‌ డెలివరీ చేసేందుకు వచ్చాడు.డెలివరీ చేసిన తర్వాత లిఫ్టులో కిందికి దిగేందుకు ప్రయత్నించగా లిఫ్టు ఆగిపోయింది. దీంతో ఆయన డయల్‌ 100కు కాల్‌ చేశాడు. సమాచారం అందుకున్న చాదర్‌ఘాట్‌ పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి దిగారు.లిఫ్టు తలపులు పగలగొట్టి జొమాటో డెలివరీ బాయ్‌ రాంబాబును బయటికి తీశారు.

Follow us on , &

ఇవీ చదవండి