Breaking News

పెట్రోల్‌, డీజిల్‌ పై క్లారిటీ ఇచ్చిన ఇండియన్‌ ఆయిల్‌!


Published on: 09 May 2025 15:03  IST

దేశవ్యాప్తంగా ఇంధనం, ఎల్‌పీజీ సరఫరాలు స్థిరంగా ఉన్నాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ శుక్రవారం ప్రజలకు తెలిపింది. ఇండియన్ ఆయిల్ దేశవ్యాప్తంగా తగినంత ఇంధన నిల్వలను కలిగి ఉందని, మా సరఫరా లైన్లు సజావుగా పనిచేస్తున్నాయని, భయపడాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇంధనం, ఎల్‌పీజీ తమ అన్ని అవుట్‌లెట్లలో తక్షణమే అందుబాటులో ఉన్నాయని కంపెనీ ఈ మేరకు తన X ఖాతాలో ఒక పోస్ట్‌లో పేర్కొంది..

Follow us on , &

ఇవీ చదవండి