Breaking News

యుద్ధం పరిష్కారం కాదు : ముస్లిం లా బోర్డ్‌


Published on: 09 May 2025 18:33  IST

భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు (ఎఐఎంపిఎల్‌బి) ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధం ఏ సమస్యకూ పరిష్కారం కాదని, దౌత్య మార్గాల్లోనే పరిష్కారం వెతకాలని బోర్డు శుక్రవారం స్పష్టం చేసింది. ఉగ్రవాదం, అమాయకుల హత్యలకు మానవ విలువల్లో స్థానం లేదని పేర్కొంది. దేశ రక్షణ కోసం తీసుకునే చర్యలకు మద్దతు ఉంటుందని బోర్డు తెలిపింది. ఈ సందర్భంగా ఒక తీర్మానం ఆమోదించి, మే 16 వరకూ బహిరంగ కార్యక్రమాలు వాయిదా వేసింది.

Follow us on , &

ఇవీ చదవండి