Breaking News

జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితి నార్మల్...


Published on: 11 May 2025 09:12  IST

జమ్మూ, అఖ్నూర్, రాజౌరిలో గత రాత్రి ఉద్రిక్తతల తర్వాత ప్రస్తుతం పరిస్థితి సాధారణంగా ఉంది. పాక్ వైపునుంచి డ్రోన్ దాడులు, కాల్పులు జరగలేదని సమాచారం. పంజాబ్‌లో ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్‌లో పరిస్థితి సాధారణంగా ఉన్నప్పటికీ, అమృత్‌సర్‌లో మాత్రం రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. విద్యుత్ సరఫరా పునరుద్ధరించినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంట్లోనే ఉండాలని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. అధికారుల సూచనలు తదుపరి సమాచారం వరకు పాటించాలని విజ్ఞప్తి.

Follow us on , &

ఇవీ చదవండి