Breaking News

రికార్డు స్థాయిలో తిరుమలేశుడి దర్శనాలు


Published on: 05 Jan 2026 11:51  IST

తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న వైకుంఠ ద్వారా దర్శనాలు భక్తుల విశేష ఆదరణతో కొనసాగుతున్నాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరిం చుకుని ప్రారంభమైన ఈ ప్రత్యేక దర్శనాలకు దేశవ్యాప్తంగా భక్తులు భారీగా తరలివస్తున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో క్రమబద్ధంగా నిర్వహిస్తున్న ఏర్పాట్లతో భక్తులు సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు.వైకుంఠ ద్వారా దర్శనాలు ప్రారంభమైన ఆరు రోజుల వ్యవధిలో మొత్తం 4,59,407 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి