Breaking News

వేధింపులు,ఆధిపత్య ధోరణితో ఏకాకులవుతారు:జిన్‌పింగ్‌


Published on: 13 May 2025 15:49  IST

ధింపులు, ఆధిప్యత ధోరణులు ప్రదర్శిస్తే.. ఒంటరిగా మిగిలిపోతారని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ వ్యాఖ్యానించారు. వాషింగ్టన్‌-బీజింగ్‌ మధ్య వాణిజ్య ఒప్పందంలో ముందడుగు పడటం.. టారిఫ్‌లకు తాత్కాలిక విరామం ఇచ్చిన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వాణిజ్య యుద్ధాల్లో విజేతలు ఎవరూ ఉండరని పునరుద్ఘాటించారు. వివిధ దేశాలు కలిసి పనిచేస్తేనే ప్రపంచ శాంతి.. సుస్థిరత సాధ్యమన్నారు. బీజింగ్‌లో బ్రెజిల్‌, కొలంబియా, చిలీ దేశాధ్యక్షులతో జరిగిన భేటీలో ఈ వ్యాఖ్యలు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి